తెలంగాణ ప్రభ,(కోనరావుపేట);3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీ లో చేర్పించాలని అంగన్వాడి సూపర్వైజర్ కనకమ్మ కోరారు. మంగళవారం కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో అమ్మ మాట- అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని ఊరంతా ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు సమతుల్య నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతోపాటు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చిన్నారులతోపాటు బాలింతలు,గర్భవతులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు అరుణ, రమాదేవి, చంద్రకళ చిన్నారులు ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
