అభివృద్ధి పనులను పరిశీలించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ఆలయ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన అభివృద్ధి పనులను సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈరోజు పరిశీలించారు. 

ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి సభ్యులు చేస్తున్న సామాజిక సేవను కొనియాడారు. 

సత్యసాయి సేవా సమితి సభ్యులు నిధుల మంజూరుకు కృషి చేసిన జువ్వాడి కృష్ణారావును ఘనంగా  సన్మానించారు ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, సంగ లింగం, ఎంబేరి నాగభూషణం, ఆడెపు మధు, మచ్చ కవిత, ఎంబేరి సత్యనారాయణ, రియాజ్, ఓలెపు రాజేష్,    శ్రీ సత్య సాయి సేవ సమి తి ట్రస్ట్ వ్యవస్థాపకులు వేముల మాణిక్యం, ట్రస్టీలు చింత రూపలత-అశోక్, ముల్క రాజేశం, గుండేటి నందకిషోర్, ఉమాపతి, ప్రభాకర్, సుభాష్, వేముల లక్ష్మీబాయి, చింత అశోక్ తదితరులు ఉన్నారు

.