పదవికే విరమణ, ప్రజాసేవ కు కాదు..
తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేస్తామని మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు అన్నారు. మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ క్లబ్ లో మండల మాజీ ఎంపీపీ పడిగెల మానస రాజు,ఎంపీటీసి లకు సిరిసిల్ల ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం చేయడం జరిగింది. అనంతరం వారికి శాలువాలు,మెమొంటోలు అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జి .రాజన్న,మాజీ జడ్పిటిసి కోడి అంతయ్య,మాజీ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు,సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షుడు వేణు గోపాల్ రావ్, మాజీ సర్పంచ్ అంకారపు అనిత రవీందర్, కందుకూరి రామ గౌడ్, సద్ద రోజ, వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మండలంలోని మాజీ ఎంపీటీసీలు,నాయకులు తదితరులు ఉన్నారు..
