"కార్మికునికి రావలసిన వేతనం ఇప్పించిన" -బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): షాపూర్ నగర్ ఇండస్ట్రీ ఏరియా "నువోకో కార్పొరేషన్ లిమిటెడ్ రెడీ మిక్స్" డ్రైవర్ గా రుస్తం ఆన్సరి, డ్రైవర్ గత కొన్ని సంవత్సరాలుగా పని చేయడం జరుగుతుంది...కొన్ని అనివార్య కారణాలవల్ల డ్రైవర్ డ్యూటీ  మానేయడం జరిగింది...రెడీమిక్స్ కాంటాక్ట్ శివారెడ్డి డ్రైవర్ కి మే, జూన్ రెండు నెలల, వేత్తనం 40వేల రూపాయలు రావాల్సి ఉండగా డబ్బులు ఇవ్వకుండా, ఏదో రకంగా నిర్లక్ష్యం చేస్తూ డ్రైవర్ ని ఇబ్బంది పెడుతూ పంపించేవాడు, అతనికి ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే మనకు న్యాయం చేస్తారో అని తోటి డ్రైవర్ల ద్వారా తెలుసుకొని  బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ అతని గురించి తెలుసుకొని రవి సింగ్ ఆఫీస్ వద్దకు వెళ్లి డ్రైవర్ కి జరిగిన అన్యాయం చెప్పుకున్నారు, ఆ తర్వాత వెంటనే స్పందించిన, రవిసింగ్ హుటాహుటిన, నువోకో కార్పొరేషన్ లిమిటెడ్ కాంటాక్ట్ శివారెడ్డి దగ్గరికి వెళ్లి డ్రైవర్ కు రావలసిన వేతనం గురించి మాట్లాడి, డ్రైవర్ కి మే, జూన్ రెండు నెలల వేతనం 40 వేల రూపాయలు ఇప్పించడం జరిగింది... డ్రైవర్ రుస్తం ఆన్సరీ, మాట్లాడుతూ నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవిసింగ్ కి నా తరపునమ్మ, మా కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు..

.