మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్, రిమాండ్ కి తరలింపు.

మూడు తులాల బంగారు చైన్ ,ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం.

సిరిసిల్ల రూరల్ సీ.ఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సీ.ఐ మొగిలి.

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); మహిళ మెడలో బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు.ఈ సందర్భంగా సీ.ఐ  మాట్లాడుతూ...మెదక్ జిల్లా గజ్వేల్ కి చెందిన పర్వతం నర్సింలు అనే వ్యక్తి మరియు సిద్దిపేట జిల్లా దుబ్బాక కు చెందిన మరో వ్యక్తి తో  కలసి తేదీ 21-6-2024 రోజున రాత్రి సుమారు  రెండున్నర గంటల ప్రాంతంలో తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో బాసా ఎల్లవ్వ w/o బాలయ్య అనే మహిళ తన ఇంటి ముందు మంచంలో నిద్రపోతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని బంగారు పూసలతాడును తెంపుకొని ద్విచక్రవాహనంపై పారిపోతున్న సమయంలో తాటిపల్లి బాలకిషన్, ఎడ్ల రమేష్ అనే ఇద్దరి మొబైల్ ఫోన్స్ కూడా ఎత్తుకొని పోవడం జరుగుతుంది. బాసా ఎల్లవ్వ తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా అప్పటి సీ.ఐ సదన్ కుమార్ మరియు ప్రస్తుత సీ.ఐ మొగిలి పోయిన మొబైల్ నెంబర్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిందుతులు సిరిసిల్ల వైపు వస్తున్నారన్న సమాచారం మేరకు తంగళ్ళపల్లి గ్రామ శివారులో సోమవారం రోజున పర్వతం నర్సింలు ను అదుపులోకి తీసుకొని తన వద్ద ఉన్న మూడు తులాల బంగారు చైన్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని మంగళవారం రోజున రిమాండ్ కి తరలించడం జరిగిందని సీ.ఐ మొగిలి తెలిపారు.పరారీలో ఉన్న మరో నిందుతుణ్ణి త్వరలో పట్టుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.

.