వడ్డెపల్లి శ్రీ నల్లపోచమ్మ గుడిలో హుండీ దోచుకునేందుకు యత్నం

ఫలితం లేకపోవడంతొ అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకొని తిరిగి వెళ్ళిపోవడం విశేషం

సిసి కెమెరాలలో రికార్డు అయిన దృశ్యం

తెలంగాణ ప్రభ ,(నర్సాపూర్):  నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని హత్నూర మండల పరిధిలోని వడ్డెపల్లి గ్రామంలో శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి గుడిలోకి ఒక ముసుగు దొంగ  ప్రవేశించాడు.  మంగళవారం నాడు ఉదయం 3 గంటల 49 నిముషాల కు ఒక  దొంగ బ్లూ జీన్స్ ప్యాంటు భూడిద రంగు జెర్కిన్ నీలం రంగు తెల్ల చారలు ఉన్న షర్ట్ వేసుకొని మూతికి మాస్కు వేసుకొని ఉన్నాడు. చేతిలో ఒక పరికరంతో వచ్చి హుండీ తెరువడానికి ప్రయత్నిచిన ఫలితం లేకపోవడంతొ అమ్మవారికి దండం పెట్టి భక్తి చాటుకొని తిరిగి వెళ్ళిపోవడం విశేషం. ఆ దొంగకు కెమెరాలు ఉన్నట్టు తెలుసేమో కాబోలు ఒక పథకం ప్రకారం ముందుగానే మొఖం కనబడకుండా తగు జాగ్రత్తలు పడ్డట్టు తెలుస్తుంది. గతంలో ఇదే ఆలయంలో రెండు సార్లు దొంగతనం జరిగింది. అప్పుడు హుండీ ఊరవతల  లభ్యం అయింది. కాని ఈ సారి ఒక దొంగ హుండీ తెరవడానికి యత్నించి స్థానికులు గమనించడంతొ అమ్మవారికి దండం పెట్టి అక్కడి నుండి పలాయనం చిత్తగించాడు.

.