ఇండ్ల నిర్మాణానికి ఇసుక దొరకక ఇబ్బంది పడుతున్న కోరుట్ల ప్రజలు : కోరుట్ల ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల పట్టణంలో  ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగినది. 

సభ్యులు 600 మంది ట్రాక్టర్ బిల్డింగ్ మేటిరియల్ సరఫరా చేస్తు జీవన ఉపాది పోందుతున్నాము. నేడు కోరుట్ల మున్సిపాలిటీ ఏరియాలో నేలకు సుమారు ఒక వంద పర్మీషన్ ఇవ్వడం జరుగుతుంది. 

ఇట్టి బిల్డింగ్లకు ఇసుక దొరకక చాల మంది మేస్త్రీలు, ఉపాది దోరకక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

దాని వలన ట్రాక్టర్ డ్రైవర్, లేబర్ లు సుమారు 600 మంది ఉపాది దోరకక ఇబ్బందికి గురి అవుతున్నారు. 

ట్రాక్టర్ ఓనర్ అసోసియేషన్ విన్నపం ఏమనగా కోరుట్లలో ప్రభుత్వం తరపున ఇసుక డంపు చేసుకొనే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. 

దానికి రెవెన్యు అధికారులు తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని వారు కోరారు.

సంఘం అధ్యక్షులు ఎండి రఫీ ఉపాధ్యక్షుడు  బెక్కం అశోక్, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

.