చిట్టాపూర్ స్పెషల్ ఆఫీసర్ చేతుల మీదుగా అథ్లెట్ హర్షవర్ధన్ రాజు కు ఘన సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గణపతి హర్షవర్ధన్ రాజు ఇటీవలే అండర్ 12 రన్నింగ్ పోటీలలో రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి ప్రశంసా పత్రం స్వీకరించడం పట్ల   హర్షం వ్యక్తం చేస్తూ,  చిట్టాపూర్ ప్రత్యేక అధికారి ఎంపిఓ జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన చిట్టాపూర్ నుండి రాష్ట్రస్థాయి క్రీడాకారుడిగా ఎదగడం అభినందనీయమని గ్రామస్తులు అందరూ గర్వించాలని, చిట్టాపూర్ క్రీడా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయమని  హర్షవర్ధన్ రాజు క్రీడా స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకొని క్రీడల పట్ల రాణించాలని వారు పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సురేష్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కారోబార్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ మైసలక్ష్మి దేవ ప్రసన్న, లైన్మెన్ శంకర్, విష్ణువర్ధన్ రాజు, రఘు, అంజరాజ్ అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు    పాల్గొన్నారు.

.