తెలంగాణ ప్రభ (కోరుట్ల): శ్రీ రాజా రాజేశ్వర భారత కళా సమితి ఆధ్వర్యంలో మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరిగినవి.
ఈ కార్యక్రమానికి అతిథులుగా ముంబైకి చెందిన ది ముంబై ఆంధ్ర మహాసభ అధ్యక్షలు సంకు సుధాకర్, సాంస్కృతిక శాఖా ఉపాధ్యక్షురాలు రాధా మోహన్ హాజరైనారు.
వీరిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు, ఈ సందర్బంగా అధ్యక్షులు సంకు సుధాకర్ మాట్లాడుతూ ఈనాటి పిల్లలకు మనం కూచిపూడి, భారత నాట్యం వంటి నృత్యాలను తప్పక నేర్పించవలెనని, దైవ చింతనకు దగ్గర ఉండే ఈ నాట్యముల వలన మన పిల్లలకు సంస్కృతిక, సాహిత్యంనందు అభిరుచి పెరుగునని, పిల్లలు వీటిని అలవర్చు కోవాలని కోరినారు.
అధేవిధం త్వరలో కాశి నగరంలో నాట్య కళా ఉత్సవాన్ని నిర్వహిస్తానని ఈ కార్యక్రమంలో పిల్లలు ఈ నాట్య కళా ఉత్సవంలో భారీ ఎత్తున వచ్చి పాల్గొనాలని అధ్యక్షులు సంకు సుధాకర్ పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలతో పాటు వారి తల్లి దండ్రులు మరియు ఎంతోమంది సాహిత్య కళాకారులూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
.