ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం...

తెలంగాణ ప్రభ (కోరుట్ల): వర్ని మండల కేంద్రంలో 2001-2002 విద్యా సంవత్సరంకు చెందిన పదో తరగతి విద్యార్థులు ఘనంగా ఆత్మీయ సమ్మేళనం మండల కేంద్రంలోని విఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. 

వడ్డేపల్లి జడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించినందుకు ఈ కార్యక్రమాన్ని ఆట ఆసంగ నిర్వహించారు. 

ఈ సందర్భంగా తాము చదువుకున్న రోజుల చిన్ననాటి, ప్రస్తుత జ్ఞాపకాలు నెమరువేరుచుకున్నారు. విద్యార్థులతో మనం చదువుకున్న పాఠశాలలోనీ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. 

అనంతరం ఆటపాటలతో నృత్యాలు చేసి సరదాగా ఉత్సాహంగా గడిపారు ముఖ్య అతిథులు తమకు విద్యతో పాటు క్రమశిక్షణ అలవర్చిన గురువులను ఘనంగా సన్మానించారు తమ గురువుల విద్యతో 53 మంది విద్యార్థులలో ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులుగా, న్యాయవాదులుగా, జర్నలిస్టులుగా వ్యాపార రంగంలో స్థిరపడి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నామని పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను గురువులతో పంచుకున్నారు తల్లిదండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని కలిగించిన ఘనత తమ గురువులకే దక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు తమపై ఆధారపడి విద్య నేర్చుకుని ఉన్నత రంగాలలో స్థిరపడ్డ విద్యార్థులను గురువులు ప్రశంసించారు. 

విద్య నేర్పిన గురువులు విజయనందన్ రావు, సత్యనారాయణ, అంజయ్య, రుక్మిణి దేవి, గోపాల్, పిఈటి వెంకటేశ్వరరావులకు పాదాభివందనం చేసి గ్రూప్ ఫోటో దిగారు. 

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి బానోత్ రమేష్ న్యాయవాది చిన్ననాటి మిత్రులందరికీ ఒక వేదికపై చేర్చడానికి 24 సంవత్సరాలుగా ఎక్కడెక్కడో స్థిరపడిన మిత్రులను అందరి ఫోన్ నెంబర్లు తెలుసుకొని ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళానికి ఎంతగానో కృషి చేశారు. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి బానోతు రమేష్ నీ అభినందిస్తూ సన్మానించడం జరిగింది ఒకే చోట చేరి ఆత్మీయ పలకరింపు ఆలింగాల నడుమ నాటి మధురకృతులను నెమరు వేసుకున్నారు.

ఈ మధుర జ్ఞాపకాలు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులలో ఇతర కారణములతో మృతి చెందిన తోటి స్నేహితులు ముగ్గురు మరణించగా తోటి స్నేహితులను గుర్తు చేసుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 

ఈ సందర్భంగా వారికి నివాళులర్పించారు వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 20వేల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేసి ముగ్గురికి మొత్తం 60 వేల రూపాయలు పూర్వ విద్యార్థుల తరఫున ఆర్థిక సహాయం చేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆదుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. 

ఈ నిర్ణయానికి గురువులు, మృతుల కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అపూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న పూర్వ విద్యార్థులు బాణోత్ రమేష్ అడ్వకేట్,డి.రాజా STO,నరెడ్ల బాలు.దడ్ల రాజు,ఎం.శ్రీనివాస్ మొబైల్,వి.భాస్కర్ ఆర్మీ, G. గోపి, రిపోర్టర్ మహమ్మద్ ఆలీ,బి.గణేష్,డి.రాజు,సాధక్, షౌకత్ అలీ,సంజు,G.సంజు గౌడ్,k.భీమా,గౌస్ పాషా,నవీన్,గంగారాం వసియోద్దీన్, బజనారాయణ, శ్రీ హరి,సతీష్,s.రాజశేఖర్,S.శ్రీకాంత్,గుజ్జ సాయిలు,రవీందర్,డి. రామకృష్ణ,బి.సాయిలు,బి.రామకృష్ణ,మొగులయ్య,బి.గోపి,జయంత్,పి.రాజు,శ్రీను పీటీ,కృష్ణమూర్తి,డి.ఓంకార్ బి.శ్రీనివాస్,రాములు,టి. సాయిలు,వాసు,మార్ని రాజేష్,.రాజు తదితరులు అందరూ పాల్గొన్నారు.

.