తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డికి కోరుట్ల కాంగ్రెస్ నేతల సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): టిపిసిసి కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట అన్వేష్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా హైదరాబాద్ లోని హకా భవన్ లో సోమవారంనాడు పదవి భాద్యతలు చేపట్టిన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డికి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పుష్పగుఛ్ఛం ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించారు.  ఈసందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విత్తనాభివృద్ది సంస్థకు జీవం పోసి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శేర్ నర్సారెడ్డి, మెట్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ప్రధానకార్యదర్శి ఏలేటి శశింధర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పిడుగు తిరుపతిరెడ్డి, తోట సంతోష్, అల్లూరి సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

.