జాతీయ సేవరత్న అవార్డు గ్రహీత డా. పేట భాస్కర్ ను సన్మానించిన ప్రజాసంఘాల నాయకులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జాతీయ స్థాయి సామాజిక ఉద్యమ నేత తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్  జాతీయ స్పూర్తి సేవరత్న అవార్డు అందుకున్న సందర్భంగా మంగళవారం తన నివాసంలో కోరుట్ల మున్నురుకాపు సంఘం అధ్యక్షులు ఎలిశేట్టి గంగారెడ్డి, అంబేద్కర్ సంఘాల నాయకులు పసుల కృష్ణ ప్రసాద్, శనిగారపు రాజేష్, గడ్డం గంగాధర్, చిట్యాల రాజేష్,అభిలాష్ లు ఘనంగా సన్మానించారు. 

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పేట భాస్కర్ ముప్పై సంవత్సరాలుగా  ప్రజాఉద్యమాలలో తనదైన శైలిలో దళిత బహుజన ప్రజలను చైతన్య పర్చడంలో ముందున్నారని, కోరుట్ల రెవెన్యూ డివిజన్ సాధనతో పాటు జాతీయ స్థాయిలో రాజ్యాంగ రక్షణే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తు ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను జాతీయ సేవరత్న అవార్డు రావడం అభినందనీయమన్నారు.

.