కోరుట్ల లో వనమహోత్సవం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఏకీన్ పూర్ నందుగల సాయిబాబా మందిరం సమీపంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా టెకోమ, వేప,కానుగ, గుల్మోర్ వంటి మొక్కలు నాటి వాటి రక్షణ కోసం ట్రీ గార్డ్స్ అమర్చడం జరిగింది.

ఈ కార్యక్రమంను ఉద్దేశించి కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, మరియు మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఈ వనమహోత్సవం కార్యక్రమంను ఒక బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి, నాటడమే కాకుండా వాటి సంరక్షణకు పాటుపడాలని, అలా వాటిని సంరక్షించినప్పుడే వనమహోత్సవం విజయవంతం అవుతుందని, అంతేకాకుండా పర్యావరణంకు మేలు జరుగుతుందని వారు తెలపడం జరిగింది. 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి అన్నం లావణ్య, వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, వార్డ్ కౌన్సిలర్ బద్ది సుజాత మరియు వార్డ్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

.