కోరుట్ల పట్టణ బీజేపీ బూత్ కార్యకర్త కుటుంబానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం చేసి అండగా నిలిచిన mp ధర్మపురి అరవింద్

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ బిజెపి బూత్ కార్యకర్త గరిగే సురేష్ కొన్ని రోజులక్రితం అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. 

గరిగే సురేష్ కుటుంబానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లక్ష రూపాయల చెక్కును మృతుని భార్య గరిగే రేఖ కు అందజేసి, తన దయగల మానవతా హృదయాన్ని చాటుకున్నారు.

ఇట్టి కార్యక్రమంలో సురేష్ భార్య గరిగే రేఖ మాట్లాడుతూ తన కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఎం పి ధర్మపురి అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. 

ఇందుకు సహకరించిన బీజేపీ 29 వ వార్డు ఇంచార్జ్ తోట రాజేశం,

బీజేపీ కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్,పట్టణ ఉపాధ్యక్షుడు, ఎర్ర రాజేందర్,181బూత్ అధ్యక్షుడు తోట రాజేశం, మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

.