కోరుట్ల సరస్వతిశిశు మందిర్ విద్యార్థుల కోసం టీవీ విరాళం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల లయన్స్ క్లబ్ సభ్యులు , మాజీ అధ్యక్షులు అయిన లయన్ వనపర్తి చంద్ర మోహన్ -  లయన్ రమ్య దంపతుల కుమారుడు చిరంజీవి శ్రీరాగ్ వనపర్తి జన్మదినం సందర్భంగా స్థానిక కోరుట్ల పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరం పాఠశాలలో స్కూలు పిల్లల అవసరము (ఆన్లైన్ క్లాసులు) నిమిత్తం Onroid TV 32 " సుమారు 10 వేల రూపాయలు  విలువ గలది విరాళంగా అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం.

ఇట్టి కార్యక్రమంలో  పాఠశాల కోశాధికారి,కరస్పాండెంట్ అయిన నీలి శ్రీనివాస్ కు TV అందివ్వడం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో క్లబ్ సెక్రెటరీ లయన్ శ్రీ గద్దె నరేంద్ర మరియు పాఠశాల PET అనిల్ ఆచర్జీ ,లింగారెడ్డి ఆచర్జీ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు కూడా పాల్గొన్నారు.

.