అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు.

తెలంగాణ ప్రభ (కోటగిరి): బాన్సువాడ నియోజకవర్గ ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్  కాసుల బాలరాజు మొట్టమొదటిసారిగా చైర్మన్ పదవి పొంది బాన్సువాడ రావడంతో ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో అభినందన సభ, సన్మాన సభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి ఉమ్మడి మండలాల యూత్ కాంగ్రెస్ నాయకులు, తేల్ల రవి యువసేన నాయకులు  మర్యాదపూర్వకం కలిసి శాలువాతో సన్మానించి పూల  పుష్ప గుచ్ఛం ఇచ్చి  శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోటగిరి  తెల్ల రవి యువసేన అధ్యక్షులు తేల్ల రవికుమార్, సభ్యులు సుదీప్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షాహిద్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిరుత దత్తు శ్రీపాద్ చెర్రీ, నాగేష్ పటేల్  సలీం తదితరులు పాల్గొన్నారు.

.