నర్సాపూర్ (తెలంగాణ ప్రభ): నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని హత్నూర మండలం కాసాల గ్రామ పంచాయతీ పరిధిలోని 12 వార్డులోనీ చౌదరి హోటల్ వెనుక భాగంలో పారిశుద్ధ్యం లోపంతో ప్రజలకు శాపంగా మారింది, దౌల్తాబాద్ కాసాల శివారు కలిసి ఉండడంతో పారిశుధ్య సమస్యను పరిష్కరించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వార్డు ప్రజలు ఆరోపణ చేస్తున్నారు, అపరిశుభ్రత తాండవిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురి చేస్తున్నాయనే ప్రజలు వాపోతున్నారు, 12వ వార్డులో కొందరు కొనుగోలు చేసిన ప్లాట్లల్లో పిచ్చి మొక్కలు, చెట్లు ఉండడంతో మరికొందరు ఇళ్లను నిర్మించుకొని మురికి నీటిని బహిరంగంగానే ఇతరుల ప్లాట్ లల్లో మురికి నీళ్లు వదలడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు ఆరోపణ చేస్తున్నారు, పలుమార్లు అధికారులకు విన్నవించిన ఏమాత్రం చర్యలు లేకపోవడంతో వర్షాకాలంలో ఎక్కడి నీళ్లు అక్కడ నిలిచిపోవడంతో విషపూరితమైన దోమలు వలన , ప్రజలు ఇబ్బంది పడుతున్నారు,
పందుల సమస్య
పంచాయతీల్లో పందుల సమస్య ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారు. ముఖ్యంగా కాసాల, దౌల్తాబాద్, పలు గ్రామాల్లోనీ పంచాయతీ ప్రాంతాల్లో పందులు వీధుల్లో స్వైరవిహారం చేయడంతో పారిశుధ్యం అధ్వానంగా మారి దోమలు విజంభిస్తున్నాయి. అసలే వర్షాకాలం కావడంతో దోమల కారణంగా అంటురోగాలు సోకే అవకాశం ఉందని భయాందో ళనలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. గతంలో అధికారులు పందుల పెంపకం దారులకు ఊరికి దూరంగా పందులను ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే కొద్దిరోజులు దూరంగా ఉన్నట్లే ఉంచి మళ్లీ మామూ లుగానే గ్రామాల మధ్య వదిలేస్తున్నారు. రాత్రి వేళ్ళల్లో, తెల్ల వారు జామున పందులను వీధుల్లో కాపరులు వదిలి వెళ్తున్నా రు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి పందుల ను ఊరికి దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు.
