గుమ్మడి ఫౌండేషన్ సందర్శించిన ఈఎన్టి డాక్టర్.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎక్లాస్ పూర్ క్యాంప్ గుమ్మడి ఫౌండేషన్ ఆశ్రమాన్ని హైదరాబాద్ ఎర్రగడ్డ డాక్టర్ ఇఎన్టి సర్జన్  సందర్శించారు. ఆశ్రమంలోని పిల్లల ఆరోగ్య చెకప్  నిర్వహించారు. వారితో మాట్లాడుతూ ..యోగక్షేమాలు తెలుసుకున్నారు.ఆశ్రమానికి   ఆయన వంతుగా 30 వేల రూపాయలను విరాళం అందజేశారు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంటలిజెన్స్ డిపార్ట్మెంట్ లీగల్ అడ్వైజర్ సంజయ్ శివరాం సందర్శించి పిల్లలకి ఆర్మీలో ఉండే సెలక్షన్ క్రమశిక్షణ విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఫౌండేషన్ నిర్వాహకులు మధు       హైదరాబాద్ ఎర్రగడ్డ ఆస్పత్రి ఈఎన్టీ  డాక్టర్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లీగల్ అడ్వైజర్ సంజయ్ శివరాం  పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

.