నేడే బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభ.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ లో మాజీ స్పీకర్ మాజీ మంత్రి బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన సభను నియోజకవర్గంలోని మండలాల,గ్రామాల  కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరలిరావాలని కోటగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కోరారు. ఈ సభలో రాష్ట్ర అగ్రో  కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ అభినందన,సన్మాన  సభ ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని పాత్రికేయులతో తెలిపారు.ఏ నెల 15న సోమవారం ఉదయం 9 గంటలకు కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం నుండి ఎస్ఎంబి ఫంక్షన్ హాల్ వరకు బైక్, కార్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సకాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు

.