బాన్సువాడలో బోనమెత్తిన మాజీ స్పీకర్ దంపతులు

తెలంగాణ ప్రభ  (కోటగిరి): కామారెడ్డి  జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీ తడ్కోల్ డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఆషాడ మాసం పురస్కరించుకొని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగకు ముఖ్య అతిధిగా  మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు సతి సమేతంగా పాల్గొని బోనం ఎత్తుకొని  ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా పట్టణ ప్రజలకు ప్రజాప్రతినిధులకు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన మాట్లాడుతూ... పాడిపంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ ప్రజాప్రతినిధులు కాలనీ భక్తులు తదితరులు పాల్గొన్నారు

.