మండల అధ్యక్షులు గోపు సాయిలు.
తెలంగాణ ప్రభ (కోటగిరి):కోటగిరి మండల కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ఎమ్మార్పీఎస్ స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గోపు సాయిలు జెండాను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న నాయకత్వం వర్ధిల్లాలని అని నినాదాలు చేశారు.మేడి పాపన్న ఎమ్మార్పీస్ నాయకులకు ఏక తాటిపై తెచ్చి సమాజంలో జరిగే విధి విధానాలను గుర్తుండే విధంగా, నాయకత్వ లక్షణాలను తెలిసే విధంగా ఎమ్మార్పీఎస్ లకు దిశ నిర్దేశం చేసిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు విద్యాసాగర్ జిల్లా నాయకులు దేగం సాయిలు నాగేశం ఉమ్మడి మండలాల ఇన్చార్జి బోర్ర సాయిలు మండల ఉపాధ్యక్షులు కన్నం శ్రీనివాస్,సభ్యులు దినేష్ సాయిలు పోశెట్టి అబ్బయ్య నవీన్ భూమయ్య లాలయ్య పోశెట్టి రవి లక్ష్మీ మక్కవ్వ ఇరవ్వ బాలవ్వ గంగమని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
.