కోడిగుడ్లు, నిత్యవసర వస్తువులన్నీ ప్రభుత్వమే అందించాలి

మండల విద్యాశాఖ అధికారి  వినతిపత్రం అందజేత.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ. విట్టల్ గౌడ్ ఆధ్వర్యంలో మండల విద్యాభివృద్ధి అధికారికి మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు అందజేయాలని వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా విట్ఠల్ గౌడ్  మాట్లాడుతూ... గత ఐదు నెలల నుండి బిల్లు రాక మధ్యాన్న భోజన కార్మికులు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. వారు అప్పులు తెచ్చి  ఇబ్బందికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోడిగుడ్లు రాగి జావా పెట్టుమనడం  సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం కోడిగుడ్లు నిత్యవసర వస్తువులు గ్యాస్ ప్రభుత్వమే అందజేయాలన్నారు. గత సంవత్సరం ప్రభుత్వమిచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయలు వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించి కార్మికులగా గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం బిల్లులు ఇవ్వని ఎడల గ్యాస్ నిత్యవసర వస్తువులు కోడిగుడ్లు  అందజేయని యెడల  రాబోయే కాలంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. మండల అధ్యక్షురాలు రమణమ్మ ,ఉషారాణి ,వీరేశం, ఆలీ, భూమయ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.....

.