పెన్షనర్లకు సీఏం హామీ.

టీ పెన్షనర్ల రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

తెలంగాణ ప్రభ (కోరుట్ల): రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ తెలిపారు.

శుక్రవారం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా  పెన్షనర్లకు సేవలందిస్తున్న జిల్లా,డివిజన్,మండల సంఘాల నేతలను హరి ఆశోక్ కుమార్ మెమోంటో,పట్టు శాలువాలతో సన్మానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో కలిసి సత్కరించి వినతిపత్రం సమర్పించామన్నారు.

ఉద్యోగుల,పెన్షనర్ల ఆరోగ్య పథకంను మెరుగుపరిచి ,అన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు  విస్తరింప జేయాలని,ప్రతి జిల్లాలో వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని,పీఆర్సీ లో 45 శాతం పైగా ఫిట్మెంట్ ఇవ్వాలని,ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని,పెన్షనర్ల కమ్యూటేషన్ ను 12 ఏళ్లకు కుదించాలని,హైదరాబాద్ లో ,జిల్లాల్లో పెన్షనర్ల భవనాలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని,తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న పింఛను దారులకు  ప్రత్యేక ఇన్సెంటివ్ ఇవ్వాలని,తదితర సమస్యలను  విన్నవించామన్నారు.

వీటిని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని  జిల్లా,డివిజన్,మండల సంఘాల ప్రతినిధులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,సహాయ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాతం,ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు దిండిగాల విట్ఠల్,సత్యనారాయణ,బొబ్బటి కరుణ, జగిత్యాల అధ్యక్షుడు బి.రాజేశ్వర్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,మెట్ పల్లి అధ్యక్షుడు గంగాధర్,మల్యల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,  తదితరులు పాల్గొన్నారు.

.