తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని మైసమ్మ నగర్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం పే బ్యాక్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల కోసం అంబేద్కర్ సేవాసమితి వారు అందించిన ఆర్థిక సహాయాన్ని ఆయన కొనియాడారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు కుమార్,వీరయ్య,ప్రసాద్, శ్యామ్,దాసు,డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్,మిట్టల్ ముదిరాజ్,సిహెచ్ దాసు, నరసింహారెడ్డి,హనుమంతు, బ్రహ్మానందం చారి, యాదగిరి, సత్తిరెడ్డి,సంతోష్ కుమార్,మనోహర్,అప్పిరెడ్డి, ఆదిలక్ష్మి,సంధ్య సాగర్. తదితరులు పాల్గొన్నారు.
