ఏబీవీపీ చింతల్ నగర్ కమిటీ ఎన్నిక అధ్యక్షులుగా మనోహర్, కార్యదర్శిగా జగదీష్

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింతల్ నగర్ కమిటీ మేడ్చల్ జిల్లా కన్వీనర్ నాగేష్ సమక్షంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కన్వీనర్ నాగేష్ మాట్లాడుతూ నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనే భావనతో ముందుకు నడుస్తుందని విద్యార్థుల పక్షాన ఎన్ని ఉద్యమాలు చేస్తూ విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతూ ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థి సమస్యలపై పోరాడుతూ అందరికీ న్యాయం జరిగేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. అనంతరం చింతల్ నగర అధ్యక్షులుగా మనోహర్, కార్యదర్శిగా జగదీష్ ను, ఎన్నుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

.