తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) బహదూర్ పల్లి లోని కె.ఎం. పాండు గవర్నమెంట్ వోకేషనల్ జూనియర్ కాలేజ్ నందు నిర్వహించిన అప్రెంటిస్ మేళాకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అప్రెంటిస్ మేళాను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మాట్లాడుతూ నేటి పోటీ సమాజంలో వృత్తి విద్యా కోర్సులకు ఎంతో ఆదరణ ఉందన్నారు. విద్యార్థులు చదువులో ఇతరులతో పోటీపడుతూ నైపుణ్యతను పెంపొందించుకున్నప్పుడే బంగారు భవిష్యత్తు లభిస్తుందన్నారు. కుత్బుల్లాపూర్ లో ఇప్పటికే జూనియర్ కళాశాల, ఒకేషనల్ కళాశాలను ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించామన్నారు. అతి త్వరలోనే డిగ్రీ కళాశాల పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్జెడి జయప్రద భాయి, సివ్ జ్యోత్స్న రాణి, ప్రిన్సిపల్స్ మైమూన్, తిరుపతయ్య, స్కిల్ డెవలప్మెంట్ రీజినల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.