నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్...

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమావేశం హాల్ లో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే  కేపీ.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని ఆయా డివిజన్లలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి నూతన పనులకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాలలో మాలిక వసతులు కల్పించి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిసిద్దుతామన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్,కమిషనర్ రామకృష్ణారావు, ఎమ్మార్వో ఫూల్ సింగ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.