రైతులకు మద్దతు తెలిపిన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి

తెలంగాణ ప్రభ (నర్సాపూర్): నర్సాపూర్ మున్సిపల్ కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేస్తూ రైతులకు శుక్రవారం నాడు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనిపోని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కెనాల్ నిర్మాణంలో భాగంగా రైతులను సేకరిస్తున్న భూములకు ప్రభుత్వం సరియైన నష్టపరిహారం ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు భూముల విలువ పెంచి తగిన  నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకోలు నిర్వహిస్తామని అని తెలిపారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మాజీ జెడ్పిటిసి రామ గౌడ్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

.