తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ కళ్యాణ మండపంలో జిల్లా మహిళ సాధికారిత కేంద్ర పరిధిలో మహిళ శిశు దివ్యంగుల , వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు.బాలింతలకు వంద రోజుల ప్రత్యేక అవగాహన శిబిరాలలో భాగంగా బుధవారం మెటర్నిటీ బెనిఫిట్స్ పై అవగాహన కార్య క్రమం నిర్వహించారు. జిల్లా మిషన్ సమన్వయ కర్త పి.స్వప్న ఆర్థిక అక్షరాస్యత నిపుణులు పుష్ప అంగన్వాడీ సూపర్ వైజర్లు సుమలత, మని జ్యోతి ప్రజ్వలన చేసి కార్య క్రమాన్ని ప్రారంభించారు.. ఈ సందర్భంగా జిల్లా మిషన్ సమన్వయ కర్త మాట్లాడుతూ జిల్లా మహిళ సాధికారిత కేంద్ర పరిదిలలో మహిళ శిశు డివ్యంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ పరిధిలో గల గర్భిణీలు బాలింతలకు 100 రోజుల ప్రత్యేక మైన అవగాహన శిబిరాలలో బాగంగా మెటర్నిటీ బెనిఫిట్స్ పై అవగాహణ కల్పించడం జరిగిందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో ప్రభుత్వం అందజేస్తున్న పౌష్ఠికాహారం ప్రతి గర్భవతులు బాలింతలు తీసుకునే విధంగా తెలియజేయడం జరిగిందన్నారు.ఈ కార్య క్రమాలు ప్రతి ప్రాజెక్టులలో కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్ అంగన్వాడి టీచర్ తదితరులు పాల్గొన్నారు.
