తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి);స్క్రాప్ షాప్ యజమానులు దొంగ సొత్తు కొనవద్దని అలా కొంటే నేరం చేసినవారవుతారని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి అన్నారు. బుధవారం ఉదయం తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో తంగళ్ళపల్లి మండల పరిధిలోని పాత ఇనుప సామాన్లు కొనే షాప్ యజమానులు మరియు ఊరూరా తిరిగి కొనే వర్తకులకు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, తంగళ్ళపల్లి ఎస్సై డి.సుధాకర్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశంలో పాత ఇనుప సామాన్ వర్తకులను ఉద్దేశించి సీఐ మొగిలి మాట్లాడుతూ.. దొంగ సొత్తుని కలిగి ఉండే వారు అమ్మకానికి వస్తే కొనకూడదని మరియు దొంగ సొత్తు ని అమ్మడానికి వచ్చిన వారి వివరాలు పోలీసులకు చేరవేయాలని, షాపులో కొనే ప్రతి వస్తువుకు రిజిస్టర్ మైంటైన్ చేయాలని ఆయన అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లైతే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు .
