రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబానికి పరామర్శ

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏక్లాస్ పూర్ క్యాంప్ రామాలయం గుడి వద్ద పుప్పల పోషవ్వ సాయిలు  బైక్ పై నుండు  పడి వాహనం అదుపు తప్పి మరణించారు.వారి  కుటుంబానికి మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ ఎంఏ. హకీమ్ పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ.. ప్రగాఢ సానుభూతిని తెలిపారు.  మీరు ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు. మరణించిన కుటుంబ పెద్ద కుమారుడు సాయికుమార్ కు ఆయన వంతు 5వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఎల్లవేళలా మీ కుటుంబానికి నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. మరణించిన వారి కుమారులు సాయికుమార్ ,రాము ఎంఏ. హకీమ్ కు  ఆర్థిక సాయం అందజేసినందుకు  కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. జల్లాపల్లి ఫారంలో  ఐశ్వర్య అమ్మాయి కడుపు నొప్పితో మరణించడంతో వారి కుటుంబానికి, భోయి లక్ష్మి ద్విచక్ర  వాహనం పై  పడి మరణించడంతో వారి కుటుంబానికి పరామర్శించే ఆర్థిక సహాయాన్ని అందజేశారు .ఆయన వెంట జల్లాపల్లి ఫారం సీనియర్ నాయకులు షేరు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

.