మా ప్రభుత్వంతోనే ప్రజాపాలన కొనసాగుతుంది : కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) దుండిగల్ మున్సిపాలిటీ పరిధి మల్లంపేట్, శంబిపూర్ గ్రామం, కెవిఆర్, స్ప్రింగ్ హుడ్స్, ప్రణీత్ కాలనీలలో వాసులు త్రీఫేస్ కరెంటు సమస్య ఉందని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలను హనుమంత్ రెడ్డి దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు వెంటనే స్పందించిన హనుమంత్ రెడ్డి త్వరలో అధికారులతో మాట్లాడి శంబిపూర్ గ్రామం లోనే సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం పేద ప్రజల సమస్యలు తీర్చడానికి ఎప్పుడు ముందే ఉంటుందని మా ప్రభుత్వంలోనే ప్రజాపాలన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని విధాలుగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

.