రేషన్ బియ్యంపట్టివేత కేసు నమోదు

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండలం పాపయ్యపల్లి గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం కలిగి ఉన్న ఆటో ఉన్నదని సమాచారం రావడంతో తంగళ్ళపల్లి ఎస్సై డి.సుధాకర్ సిబ్బందితో కలిసి పాపయ్యపల్లి గ్రామానికి వెల్లగా అక్కడ AP15V 3368 నెంబరు ప్యాసింజర్ ఆటో లో అక్రమ రేషన్ బియ్యాన్ని గుర్తించి అట్టి  బియ్యాన్ని కలిగి ఉన్న ఆటో ఓనర్ ను విచారించగా తన పేరు మోతే.విజయ్ గ్రామం బద్దెనపల్లి అని తెలిపి తాను అధిక లాభాల కోసం పిడీస్ బియ్యం దందా చేస్తున్నానని, మరియు ఇట్టి గ్రామాలలో సేకరించిన రేషన్ బియ్యాన్ని చిన్నకోడూరు మండలం రామంచ గ్రామానికి చెందిన నరేష్ అనే వ్యక్తికి అధిక లాభాల కొరకు అమ్ముకుంటానని తెలపడంతో ఆటోని మరియు బియ్యాన్ని స్వాదీనం పరుచుకుని బియ్యాన్ని తరలిస్తున్న మోతే విజయ్ మరియు బియ్యాన్ని అక్రమంగా కొంటున్న నరేష్ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు. ఇట్టి రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంలో ఎస్సై వెంట కానిస్టేబుళ్లు సంపత్ కుమార్, రామ్మోహన్ లు ఉన్నారు.రేషన్ బియ్యo అక్రమ రవాణాని గుర్తించిన కానిస్టేబుల్ సంపత్ మరియు రామ్మోహన్ లను ఎస్ఐ డి.సుధాకర్ అభినందించారు. ఎవరైనా అక్రమంగా రేషన్ బియ్యం కలిగి ఉన్న లేదా కొన్న వెంటనే తంగళ్ళపల్లి పోలీసులకు నేరుగా లేదా ఫోన్ ద్వారా తెలపాలని అట్టి సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

.