తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాగి జావా వడ్డన చేసే సమయంలో స్థానిక మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ పాఠశాలను అకస్మాత్తుగా సందర్శించి, తనిఖీ చేశారు. మెనూ ప్రకారం రాగిజావను విద్యార్థులకు అందజేస్తున్నారా? లేదా? అని విద్యార్థిని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ... ప్రతిరోజు సరియైన సమయంలో రాగిజావను అందిస్తున్నారని విద్యార్థులు మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ తో తెలిపారు. రాగి జావా అందిస్తున్న భోజన కార్మికులకు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఆయన ఉపాధ్యాయ బృందానికి అభినందించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, బర్ల రవి, శ్రీధర్, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు ఉన్నారు.
