తెలంగాణ ప్రభ (కోరుట్ల): జాతీయ స్పూర్తి సేవారత్న అవార్డు లభించిన సందర్భంగా కోరుట్ల సాయిబాబా దేవాలయం లో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మిత్రులతో కలిసి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈసందర్భంగా పేట భాస్కర్ మాట్లాడుతూ ఈ జాతీయ అవార్డుతో నా పై మరింత బాధ్యత పెరిగిందని, నన్ను గుర్తించి అవార్డు ఇస్తున్న స్సూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ఎన్జీవో సంస్థ వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడు అ సాయినాథుని దీవెనలు, అత్మీయుల అండదండలు, సంఘ నాయకుల ప్రోద్భలంతో ప్రజా లక్ష్యపు అంచున నిరంతరం ఉద్యమిస్తానని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు ఎలిశేట్టి గంగారెడ్డి, పసుల కృష్ణ ప్రసాద్, ఇట్యాల రాజేందర్, దాసరి రమేష్, శనిగారపు రాజేష్, షాహేద్, దినేష్ లు పాల్గొన్నారు.
.