తెలంగాణ ప్రభ (కోటగిరి): త్యాగశీలి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి నాయకులు,జిల్లా,మండల పోలింగ్ బూత్ నాయకులు అందరూ కలసి అమ్మ పేరుతొ ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ పార్టీ,కార్యక్రమ ఇంచార్జి యెండల లక్ష్మీ నారాయణ పిలుపు మేరకు కోటగిరి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు ఏముల నవీన్ తన తల్లితో కలిసి మంగళవారం ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాన్సువాడ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ యెండల లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు ప్రతి బిజెపి కార్యకర్త అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని కోరారు. బూత్ స్థాయి నుండి రాష్ట్ర నాయకుల వరకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ఒక మొక్క నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
