అథ్లెట్ హర్షవర్ధన్ కు ఎస్ఐ కిరణ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గణపతి హర్షవర్ధన్ రాజు ఇటీవలే అండర్ 12 రన్నింగ్ పోటీల్లో రాష్ట్రస్థాయిలో రాణించి ప్రశంస పత్రం స్వీకరించిన సందర్భంగా మల్లాపూర్ ఎస్ఐ పబ్బ కిరణ్ కుమార్  శాలువాతో  సత్కరించి అభినందనలు తెలియజేశారు. 

రాబోయే రోజుల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ శ్రేణిలో రాణించి గ్రామానికి, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, నేటి విద్యార్థులు అందరూ హర్షవర్ధన్ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రాజు తండ్రి రాష్ట్రస్థాయి యువ పురస్కార్ అవార్డు గ్రహీత విష్ణువర్ధన్ రాజు పాల్గొన్నారు.

.