బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మండలం నాగుల పేట గ్రామానికి చెందిన కేతిరెడ్డి మోహన్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించగా, ఈరోజు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు గ్రామంలోని మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఈ సమయంలో ధైర్యంగా ఉండాల్సిందిగా కుటుంబ సభ్యులను ఆయన కోరారు. 

ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుట్ల నియోజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, మెటుపల్లి బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి, మెటుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జెట్టి లింగం, నర్సారెడ్డి,గంగా నరసయ్య, శేఖర్ రెడ్డి, స్వామి, వెంకటి, సైదు గంగాధర్ తదితరులు ఉన్నారు

.