యూసఫ్ నగర్ గ్రామంలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎంపీడీవో

తెలంగాణ ప్రభ (కోరుట్ల): కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన కోరుట్ల మండల ఎంపీడీవో రామకృష్ణ. 

ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. 

అదేవిధంగా రాష్ట్రంలో అడవుల శాతం పెంచాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గుగ్గిళ్ళ సురేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గుగ్గిళ్ళ ప్రియాంక, గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గంగుల నరేషం, ఎంపీఓ నీరజ, పంచాయతీ కార్యదర్శి అనూష, ఏపీవో మమత, నాయకులు గుగ్గిల్ల శ్రీనివాస్, ఉపాధి హామీ కూలీలు, మహిళా సంఘాల సిఎలు సమీనా, మాధురి, మహిళలు సుప్రియ, పల్లవి, అంగన్వాడి కార్యకర్తలు మంజుల, గీత, ఆశ కార్యకర్తలు లయ, రాదా తదితరులు పాల్గొన్నారు.

.