తెలంగాణ ప్రభ (కోరుట్ల): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోరుట్లలోని ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది
ఈ సందర్భంగా ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేణి సునీల్ మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా విద్యార్థుల కోసం నిరంతరం అనేకమైన ఉద్యమాలు నిర్వహిస్తూ, నిత్యం సమాజం కోసం దేశం కోసం పాటుపడే ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవీపీ జాతీయ పునర్ నిర్మాణమే లక్ష్యంగా అనేకమంది విద్యార్థులను దేశభక్తి వైపు జాతీయత భావం వైపు నడిపిస్తూ, కేవలం ఆందోళనాత్మక కార్యక్రమాలకే పరిమితం కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ సమాజానికి మరింత దగ్గరగా నిత్యం విద్యార్థి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న విద్యార్థి సంస్థ ఏబీవీపీ అని, తెలంగాణ ఉద్యమంలో సైతం ఏబీవీపీ పాత్ర కీలకమని గుర్తు చేశారు.
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సుమారు 60 లక్షల మెంబర్షిప్ తో ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థుల సంస్థ ఏది అంటే ఏబీవీపీ అని కొనియాడారు.
ఇలాంటి సంస్థలు పనిచేయడం గర్వంగా ఉందని వారు అన్నారు, అనంతరం విద్యార్థులచే మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఎస్ విభాగ్ కన్వీనర్ మామిడిపల్లి పవన్ , నగర సంయుక్త కార్యదర్శి మహాదేవ్ , ప్రణయ్, నితీష
.