తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): జగద్గిరిగుట్ట షిర్డీ హిల్స్ లో నూతంగా ఏర్పాటు చేసిన డా. బి.ఆర్.అంబేద్కర్ & బాబు జగ్జీవన్ రామ్ గ్రంథాలయ నిర్మాణ దాత దాసు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ వజ్రం కంటే విలువైనది పుస్తకం అని, దైనందిక జీవితంలో మానసిక ప్రశాంతతను పొందేందుకు మంచి పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం చైర్మన్ వేణు యాదవ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు ఎత్తరి మారయ్య, యేసురత్నం, ఇందిరా గౌడ్, విఠల్, బ్రహ్మానంద చారి, భద్రప్ప, జైహింద్ రాంబాబు, అనిల్, ఎస్ రాజు, కరుణాకర్, నాగేష్, ఎస్.మహేందర్, స్వామి దాసు, ప్రభాకర్, నరేందర్, శ్రీ సాయి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ షిరిడి హిల్స్ అధ్యక్షులు సిహెచ్.దాస్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్, కోశాధికారి ఎం.శేషు, బస్తివాసులు తదితరులు పాల్గొన్నారు.
.