పి.హెచ్.సి.లో మొక్క నాటిన డాక్టర్ కరణ్

తెలంగాణ ప్రభ (కోటగిరి): పొతంగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో డాక్టర్ కరణ్ వైద్య సిబ్బందితోపాటు మొక్కను నాటారు. ఆయన మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పీ.హెచ్.సి.లో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. పి హెచ్ సి ఆవరణలో మొక్కలు నాటడంతో  ఆరోగ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలలో మొక్కలు నాటాలని ఆయన ఆరోగ్య సిబ్బందికి సూచించారు.  మొక్కలు నాటడంతో వాతావరణ కాలుష్యం నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. మొక్కలను నాటడంతో వర్షాలు అధికంగా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాధిక, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, ఆరోగ్య సూపర్వైజర్ సాయికుమారి, ఏఎన్ఎం లలిత, ఆరోగ్య సిబ్బంది తదితరులు ఉన్నారు.

.