కోరుట్లలో ఘనంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి వేడుకలు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో  సోమవారం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ పేదల పెన్నిధి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని తరాలు మారిన ఆయన పాలన ఎవరు మర్చిపోలేనిదని అన్నారు ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజo, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎలేటి మహిపాల్ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్ ఎంబెరీ నాగభూషణం, ఎంబేరి సత్యనారాయణ, మచ్చ కవిత, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, పట్టణ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు  శ్రీరాముల  అమరేందర్, దండవేని వెంకట్,  ఎడ్ల రమేష్,  మల్లారెడ్డి, చిట్టి మిల్లి రంజిత్ గుప్తా, తుపాకుల బాజన్న,  పాతర్ల సత్యం, రిజ్వాన్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సైదు గంగాధర్, పోగుల భూమన్న, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

.