తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి మండల పరిధిలోని ఎత్తోండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని,
విద్యార్థులకు సీజనల్ వ్యాధుల, జాతీయ కిటక జనీత వ్యాధుల పై అవగాహనా సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. విద్యార్థులు వారి వారి ఇంటి పరిసరాలలో నీరు నిలువకుండా, దోమల వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు తెలియ చేయాలన్నారు. దోమలు కుట్టకుండా, పుట్ట కుండా పూర్తిగా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ,ప్రతి వారానికి ఒక సరి గోళ్లు కత్తిరింకొవాలని సూచించారు.బయట తిను బండారాలు శుభ్రంగా కడిగి తినాలని అన్నారు. బయట లభించే చిరు తిండన్లు తినకూడదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఎం.ఎల్.హెచ్.పి.హిమాంజలి, ఏఎన్ఎం సరోజ, ఆశా వర్కర్లు స్రవంతి, అరుణ, రుక్మిణి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
.