మెటుపల్లి పట్టణంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం  బంగారు పెద్దమ్మ తల్లికి బోనాల జాతర వైభవంగా నిర్వహించారు.

మహిళలు రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారికి బొనాలను నెత్తిన ఎత్తుకొని డప్పు చప్పుళ్ల మధ్య పురవీధుల గుండా బోనాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు.  పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతల మధ్య బోనాల వేడుక ఘనంగా సాగింది.  

పట్టణ శివారులో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయం వద్దకు బోనాలను ఊరేగించారు.

 అనంతరం ఆలయం చుట్టూ బోనాలతో ఐదు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి భక్తి భావంతో బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. 

పోతురాజుల విన్యాసాలు కేరింతల మధ్య బోనాల వేడుక ఘనంగా సాగింది.

ఈ వేడుకలకు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు ఆదిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి  సుజాత,ముదిరాజ్ సంఘం,అడకట్టు సంఘం అధ్యక్షులు జక్కం బాబు,మఠంవాడ సంఘం యామ గణేష్,జక్కం రమేష్, పోచమ్మ వాడ సంఘం నేమూరి బాలకృష్ణ,జిట్టవేణి నరసయ్య, కౌన్సిలర్ యమ రాజయ్య, మారంపల్లి రంజిత్,నేమురి లక్ష్మయ్య,ముదిరాజ్ సంఘ సభ్యులు,మహిళలు,భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

.