మెటుపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి పురస్కరించుకొని ఆయన ఫోటోకు పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు జరిపారు .

అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేదలకు ఆరోగ్యశ్రీ పథకం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ అలాగే పేద విద్యార్థులు ఇంజనీర్ చదవాలన్న కోరికలు వారిని నిజం చేశారని అలాగే పేదలకు అనేక పథకాలు  ప్రవేశపెట్టారని  వారు అన్నారు.

 ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం,మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, సీనియర్ నాయకులు ఆకుల లింగారెడ్డి,  సాయన్న,చెర్లపల్లి రాజేశ్వర్ గౌడ్,జెట్టి లక్ష్మణ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,బురం మహేందర్,జాకీర్, షకిల్,పుల్లూరు వెంకటేష్,మల్లేష్, శంకర్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

.