తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా కొనసాగింది.
ముఖ్య అతిథులుగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు లు ప్రత్యేక పూజలు చేసి అనంతరం పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపం నుండి ప్రారంభమైన రథయాత్ర కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, బస్ డిపో మీదుగా మహాలక్ష్మీ దేవాలయం వరకు రథయాత్ర కొనసాగింది.
భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగుతూ భక్తులు పరమానందాన్ని పొందారు.
హరే కృష్ణ హరే కృష్ణ... కృష్ణ కృష్ణ హరే హరే అంటూ స్వామివారి రథం ముందు నృత్యాలు చేశారు.భక్తులు...
ఆశాడం ద్వితీయ పక్షం నుండి ఆషాడ దశమి వరకు 9రోజుల పాటు జగన్నాథ రతయాత్ర కొనసాగుతుందని ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధులు తెలిపారు.
టెంపుల్ కి వెళ్లి దర్శనము చేసుకోలేని భక్తుల వద్దకు స్వామివారు ఈ రథయాత్ర ద్వారా మన ముంగిళ్ళలోకి వస్తున్నారని, ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరారు.
9వ తేదీ కోరుట్ల,11వ తేదీ రాయికల్,13వ తేదీ జగిత్యాల, 15వ తేదీ కరింనగర్ పట్టణాల్లో రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు
.