బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని  ఇందిరానగర్ కు చెందిన బోలబత్తిని రాజేశం గత వారం క్రితం అనారోగ్యంతో మరణించగా ఆదివారం రోజున తంగళ్ళపల్లి గ్రామ కాంగ్రేస్ శాఖ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించడం జరిగింది. అనంతరం వారికి వితరణగా గ్రామ మాజీ ఉప సర్పంచ్ పెద్దూరి తిరుపతి అర క్వింటాలు బియ్యం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరపున అండగా ఉంటామని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామ శాఖ అధ్యక్షులు నెరల్లా నరసింగం గౌడ్,పద్మశాలి సంఘం అధ్యక్షులు రాపెళ్లి ఆనందం,పొన్నాల పరుశురాం,యూత్ అధ్యక్షులు చుక్క శేఖర్,సుద్దాల కరుణాకర్,బండి పరుశురాం,పయ్యావుల శ్రీను,ఉమా శంకర్,మామిడాల విజయ్,తౌటి శివ తదితరులున్నారు.

.