క్షయ వ్యాధి నివారణ సర్వే.

తెలంగాణ ప్రభ (కోటగిరి): కోటగిరి ఉమ్మడి మండలంలోని క్షయ వాది నిర్మూలనే లక్ష్యంగా 18 ఏళ్లు నిండి అర్హులైన వారి  వివరాలు సేకరించి వాయోజనుల బీసీజీ టీకా సర్వేను   నిర్వహిస్తున్నట్లు మండల ఆరోగ్య  విస్తరణ అధికారి గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి మండలంలోని ఆయ గ్రామాలలో ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికి తిరుగుతూ   వివరాలు సేకరిస్తారన్నారు. ఈ సర్వే  సందర్బంగా గ్రామాలలోని కుటుంబ యజమాని సభ్యులతోపాటు 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వారు అడిగిన వివరాలను తెలియజేస్తూ సహకరించాలని ఆయన కోరారు.

.