పెద్దమ్మ తల్లి బోనాల పండగలో పాల్గొన్న జువ్వాడి నర్సింగరావు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ అయిలాపూర్ రోడ్ లో గల పెద్దమ్మతల్లి దేవాలయంలో బోనాల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు బోనం ఎత్తుకొని అందర్నీ ఆకర్షించారు. 

అనంతరం జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ పెద్దమ్మతల్లి దయవల్ల ఈ ప్రాంత ప్రజలందరూ పంటలు సమృద్ధిగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, మహిళా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత,  కౌన్సిలర్ ఎంబేరి నాగభూషణం, మ్యాకల నర్సయ్య, కో ఆప్షన్ మెంబర్ రెంజర్ల కళ్యాణి, ఏంబేరి సత్యనారాయణ,  దండవేని వెంకట్, తుపాకుల బాజన్న, పాతర్ల సత్యం, నేమూరి భూమయ్య, ఈరవత్రిని దశరథం,  చింత రూప లత, అశోక్, ఎడ్ల నవీన్    కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు పెద్దమ్మతల్లి దేవాలయ కమిటీ సభ్యులు ముదిరాజ్ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.

.